![]() |
![]() |

ప్రభుదేవా గురించి చెప్పాలంటే ప్రేమికుడు మూవీ గురించే ముందు చెప్పాలి. ఆ సినిమాలో ఊర్వశి సాంగ్ ఒక్కటే ప్రభుదేవాని - వడివేలును టాప్ రేంజ్ లోకి తీసుకెళ్లింది. ట్రాన్స్పరెంట్ గా ఉన్న రన్నింగ్ బస్ మీద వీళ్ళ డాన్స్ చూస్తే 90 స్ లో అందరికీ పూనకాలు వచ్చేసేవి. ప్రభుదేవాకి ఇదొక ల్యాండ్ మార్క్ సాంగ్ అని చెప్పొచ్చు. "ముక్కాలా మూకాబులా" సాంగ్ ఐతే వేరే రేంజ్. అలాంటి ప్రభుదేవా ఇప్పుడు ఒక షోకి వచ్చేసారు. జయమ్ము నిశ్చయమ్మురా షో ప్రతీ వారం కొత్త కొత్త సెలబ్రిటీస్ తో ఆడియన్స్ కి ఫుల్ జోష్ ని అందిస్తూ సాగుతోంది. ఇక ఈ వారం షోకి కింగ్ ఆఫ్ డాన్స్, మ్యాన్ ఆఫ్ మూవ్స్ ఐన ప్రేమికుడు ప్రభుదేవా వచ్చేసారు. ఇక రావడమే తన డాన్స్ మూవ్స్ తో ఫుల్ ఎంటర్టైన్ చేశారు. "మాములుగా చిన్నప్పుడు అందరూ సిగ్గుపడతారు ఓకే కానీ నువ్వు ఇన్నేళ్ళుగా సిగ్గు పడుతూనే ఉన్నావ్" అంటూ జగపతి బాబు అనేసరికి ప్రభుదేవా నిజంగానే సిగ్గుపడిపోతూ తలదించుకుని ముసిముసి నవ్వులు నవ్వేసుకున్నారు. "మరి గోవాలో సిగ్గులేకుండా ఉన్నావే" అని అడిగారు జగ్గు భాయ్. "ఈ షో గోవాలో పెట్టి ఉంటే బాగుండేది" అన్నారు ప్రభు దేవా. "సుందరం గారు మీ ఫాదర్ అంత పెద్ద డాన్స్ మాస్టర్.ఆయన స్ట్రిక్ట్ ఆ ఎప్పుడైనా కొట్టారా " అన్నారు జగ్గు భాయ్. "ఫాదర్ అంటే భయం.." అని ప్రభుదేవా అనేసరికి బ్యాక్ గ్రౌండ్ లో "అబ్బనీ తియ్యని దెబ్బ" సాంగ్ ప్లే అయ్యింది.
"ఆయన కొట్టినప్పుడు కమ్మగా లేదు" అంటూ నవ్వుతూ చెప్పారు ప్రభుదేవా. "అందరికీ తెలుసు ప్రభుదేవా అంటే డాన్స్ డాన్స్ అంటే ప్రభుదేవా అని " అని జగ్గు భాయ్ అడిగారు. "హిప్ హాప్, బ్రేక్ డాన్స్ , జాజ్ అవన్నీ తెలీదు. నాకు నా డాన్స్ తెలుసు అంతే" అన్నారు ప్రభుదేవా. మరి నీ డాన్స్ చూడాలి కదా అని జగ్గు భాయ్ అడిగేసరికి డాన్స్ చేసి చూపించారు ప్రభుదేవా. ప్రేమికుడు మూవీ రిలీజ్ అయ్యాక అబ్బాయిలంతా బ్యాగీ ఫాంట్స్ కొనుక్కుని ప్రభుదేవా స్టెప్స్ ని బాగా ఫాలో అయ్యేవాళ్ళు. మరి అలాంటి ప్రభుదేవా ఈ షోలో ఎలాంటి కబుర్లు చెప్తారో చూడాలి.
![]() |
![]() |